calender_icon.png 13 February, 2025 | 12:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ పుట్టినరోజున వృక్షార్చన

12-02-2025 12:31:49 AM

* 17న ప్రతి ఒక్కరు 3 మొక్కలు నాటాలి

* మాజీ మంత్రి కేటీఆర్ పిలుపు

హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): కేసీఆర్  జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. వృక్షార్చన కార్యక్రమాన్ని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ చేపడుతున్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కేటీఆర్ మంగళవారం విడుదల చేసి మాట్లాడారు. మొక్కలు నాటి, సంరక్షించడమే కేసీఆర్‌కు పుట్టినరోజు కానుక అన్నా రు. ఈ వృక్షార్చనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సంతోష్‌కుమార్ కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, బీగాల గణేష్, శంకర్‌నాయక్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో-ఫౌండర్ రాఘవ పాల్గొన్నారు.