26-03-2025 12:00:00 AM
భద్రాచలం పర్యాటక అభివృద్ధికి దోహదం
శ్రీరామనవమి సందర్భంగా ప్రారంభించనున్న సీఎం
సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): గిరిజన కళాకారుల ప్రతిభను చాటేందుకు, వారి చేతి పనులకు విస్తృత మార్కెట్ సౌలభ్యాన్ని అందించేందుకు భద్రాచలంలో ఏర్పాటు చేస్తున్న ట్రైబల్ మ్యూజియం దోహదపడుతుందని రాష్ర్ట రెవె న్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. భద్రాచలం చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామాల అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుందన్నారు. మంగళవారం భద్రాచలం ట్రైబల్ మ్యూజి యం బ్రోచర్‌ను శాసనసభ ఆవరణలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కతో కలిసి పొంగులేటి ఆవిష్కరిం చారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడు తూ.. భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకల సం దర్భంగా రేవంత్‌రెడ్డి మ్యూజియాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. ట్రైబల్ మ్యూజి యం ఏర్పాటుతో గిరిజనుల గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి మరింత అవకాశం ఏర్పడిందన్నారు. ఈ మ్యూజి యం గిరిజన సంప్రదాయాలు, వేషభాషలు, జీవనవిధానం, హస్తకళలు, ఆచార వ్యవహారాలను ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు ఉపయోగపడుతుందన్నారు. మ్యూజియం ఏర్పాటుతో భద్రాచలం పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.