ఇబ్రహీంపట్నం అనిరెడ్డి రామరక్ష ఆసుపత్రిపై కేసు నమోదు
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): కనీస అర్హతలు లేకుండానే రోగులకు చికిత్స చేస్తూ డబ్బులు దండుకుంటున్నట్లు నకిలీ వైద్యుల గుట్టురట్టుంది. ఇబ్రహీంపట్నం మండలం మంచాల రోడ్డు లో ఉన్న అనిరెడ్డి రామరక్ష ఆసుపత్రిని నకిలీ డాక్టర్‌తో నడుపుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం ఎస్‌ఓటీ బృందం, ఇబ్రహీంపట్నం పోలీసులు కలిసి దాడిచేశారు. దాడుల్లో.. నకిలీ డాక్టర్‌గా చలామని అవుతున్న చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవళిక అలియాస్ శిరీష ఎలాంటి సర్టిఫికెట్లు లేకుండా ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు నకిలీ డాక్టర్‌తో పాటు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.