calender_icon.png 9 February, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతదేహానికి చికిత్స

09-02-2025 01:29:02 AM

  • రూ.లక్షల్లో బిల్లుల వసూలు

మియాపూర్‌లోని సిద్ధార్థ న్యూరో హాస్పిటల్‌లో ఘటన

శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 8: మదీనగూడలోని సిద్ధార్థ న్యూరో హాస్పిటల్‌లో మృత దేహానికి చికిత్స చేసి, రూ.లక్షల్లో వసూలు చేసినట్టు తెలుస్తున్నది. నెల రోజుల క్రితం జీ సుహాసిని(26) అనే మహిళ కళ్లు తిరిగి పడిపోతే కడప హాస్పిటల్ నుంచి సిద్ధార్థ న్యూరో హాస్పిటల్‌కి బంధువులు తీసుకెళ్లారు. నెల రోజుల నుంచి వైద్యులు ఆమెకు వైద్యం చేస్తున్నారు.

ఈ క్రమంలో రూ.17.50 లక్షల బిల్లు వేయగా.. అందులో రూ.12.50 లక్షలు కుటుంబీకులు చెల్లించారు. మిగిలిన రూ.5 లక్షలు కూడా చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యం సుహాసిని కుటుంబీకులపై ఒత్తిడి తెచ్చింది. కానీ బంధువులకు అనుమానం రావడంతో బిల్లు చెల్లించడానికి నిరాకరించా రు. దీంతో సుహాసినిని నిమ్స్‌కు తీసుకెళ్లండని ఆసుపత్రి యాజమాన్యం చెప్పింది.

శని వారం నిమ్స్‌కు తీసుకెళ్లి ఎమర్జెన్సీలో చేర్పించగా రెండు రోజుల క్రితమే చనిపోయినట్లు నిమ్స్ వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని సిద్ధార్థ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లిన బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నా చేశారు.

చనిపోయిన విషయం దాచిపెట్టి వైద్యం చేస్తున్నట్టు నమ్మించి, రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేస్తారా అంటూ మండిపడ్డారు. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు.

ఆసుపత్రి పరువు పోతుందనే ఉద్దేశంతో యాజమా న్యం పోలీసులచే బలవంతంగా మృతదేహా న్ని అక్కడి నుంచి తరలించేందుకు ఒత్తిడి చేసినట్టు మృతురాలి బంధువులు ఆరోపణలు చేశారు.