calender_icon.png 5 January, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిండం గుండెకు రెయిన్‌బోలో చికిత్స

04-01-2025 01:46:25 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3 (విజయక్రాంతి): తల్లి గర్భంలోని పిండం గుం డెకు రెయిన్‌బో ఆస్పత్రిలో సంక్లిష్టమైన చికిత్సను విజయవంతంగా అందించినట్టు ఆ ఆస్పత్రి చైర్మన్, ఎండీ డాక్టర్ రమేశ్ కంచర్ల, రెయిన్‌బో చిల్డ్రన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ చీఫ్ పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కోనేటి నాగేశ్వరరావు తెలిపారు.

ఎంతో సున్నితమై న, అధిక ప్రమాదం పొంచి ఉన్న ఈ చికిత్స ను విజయవంతం చేయడం, పుట్టుకకు ముందే జీవితాలను రక్షించే ఆవిష్కరణకు తమ వైద్య బృందం సమిష్టి కృషికి నిదర్శనమన్నారు.  త మ అసాధారణ వైద్యబృందం పీడియాట్రిక్ కార్డియాక్ సంరక్ష ణలో అద్భుతమైన మైలు రాయిని సాధించినందుకు గర్వపడుతున్నామని చెప్పారు.

రోగుల సంరక్షణ పట్ల తమ వైద్యుల అంకితభావం, నైపు ణ్యం, నిబద్ధత కొత్త ప్రమాణాలు సృష్టించిందని పేర్కొన్నారు. ఈ విజయం తమ వైద్యుల ప్రతిభ ను చాటడమే కాకుండా, పిల్లల ఆరోగ్య సం రక్షణలో తమ నిరంతరం ఆవిష్కరణ నైపుణ్యాలకు నిదర్శనమని వెల్లడించారు.