ముంబై, జూలై 10, : హిట్ అండ్ రన్ కేసులో అధికారులు చర్యలను వేగవంతం చేశారు. నిందితుడు మిహిర్ షా (24) మ ద్యం సేవించిన పబ్‌ను బుల్డోజర్లతో కూల్చివేశారు. జుహూ ప్రాంతంలో ఉన్న వైస్ పబ్ నిబంధనలు ఉల్లంఘించిందని.. అధికారులు స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులు సీజ్ చేసిన మరుసటి రోజే కూల్చివేతలకు ఉపక్రమించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మృతురాలి భర్త నిందితుడి అరెస్టును హర్షిస్తూనే ఇలా మాట్లాడారు. మా ఫ్యామిలీలో జరగరాని ఘోరం జరిగిపోయింది. మేము నిరుపేదలం.. మాకు ఎవరూ అండగా నిలవరు. నిందితుడు జైలుకు వెళ్లాడు. కోర్టు త్వరలోనే బెయిల్ మంజూరు చేస్తుంది’ మాకు న్యాయం కావాలి అని వాపోయారు.