calender_icon.png 3 April, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హత లేని వైద్యులతో వైద్యం

03-04-2025 12:34:18 AM

యాజమాన్యంపై క్రిమినల్ కేసు రూ. 5 లక్షల జరిమానా 

మేడ్చల్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): నకిలీ డాక్టర్లచే వైద్యం చేయడమే గాక, అధిక డోసు ఇచ్చి ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ప్రైవేట్ ఆసుపత్రి పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయడమే గాక, 5 లక్షల రూపాయలు జరిమానా విధించారు.

ఆస్పత్రి రిజిస్ట్రేషన్ 60 రోజులపాటు సస్పెండ్ చేసి, ఆస్పత్రికి సీజ్ చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని చెంగిచెర్ల లో ఉన్న భవిష్య వెల్ విషర్ ఆసుపత్రిని జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ సి ఉమా గౌరీ ఆధ్వర్యంలో అధికారుల బృందం బుధవారం తనిఖీ చేసింది. ఈ తనిఖీలో విస్తు గొలిపే నిజాలు బయటపడ్డాయి.

వైద్యులకు కనీస అర్హత లేదు. అధిక డోసు మందులు ఇవ్వడమే గాక, మెడికల్ డైరెక్టర్ లేకపోవడం, పారా మెడికల్ సిబ్బందికి లైసెన్స్ లేకపోవడం గుర్తించారు. దీంతో కఠిన చర్యలు తీసుకున్నారు. వైద్య పరికరాలు, ప్రయాగ్నొస్టిక్ ఉపకారణాలు కూడా జప్తు చేశారు. ఈ తనిఖీలు వైద్యాధికారిని డాక్టర్ సి ఉమా గౌరీ, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ గీత, అసిస్టెంట్ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వినోద్, రెవెన్యూ, పోలీసు అధికారులు పాల్గొన్నారు.