ఎపియోన్ పెయిన్ సెంటర్‌లో అందుబాటులోకి
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 24 (విజయక్రాంతి): ఎపియోన్ పెయిన్ సెంటర్‌లో ఇకనుంచి సూపర్ పీఆర్‌పీతో ఆస్టియో ఆర్థరైటిస్(మోకాలి నొప్పి) చికిత్స అందుబాటులో ఉంటుందని ఎపియోన్ వ్యవస్థాప కుడు డాక్టర్ దారా సుధీర్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాధారణ పీఆర్‌పీతో పోలిస్తే సూపర్ పీఆర్‌పీలో 25 రెట్లు గ్రోత్ ఫ్యాక్టర్లు, నొప్పిని వేగంగా నయం చేయడానికి యాక్టివేటర్లు ఉంటాయన్నారు.
ఈ చికిత్స గ్రేడ్-4 ఆస్టియో ఆర్థరైటిస్‌లో గొప్ప విజయాన్ని సాధిస్తోందని వెల్లడించారు. దేశంలోనే మొట్టమొదటి బహుళ విభాగ దీర్ఘకాలిక నొప్పి నివారణ కేంద్రం ఎపియోన్ అని అన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో అన్ని రకాల కీళ్ల నొప్పులతో సహా దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతున్న రోగులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. శస్త్ర చికిత్స లేకుండా, కనీస ఇన్వాసివ్ డే కేర్ విధానం-రీజెనరేటివ్ థెరపీ, ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందిస్తుంది.
ఇప్పటివరకు మోకాలి కీళ్ల నొప్పికి 55వేల ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా(పీఆర్‌పీ) చికిత్సలు విజయవంతంగా నిర్వహించామని ఆయన పేర్కొన్నా రు. 8 సంవత్సరాల కార్యకలాపాల తర్వాత ఎపియోన్ ఇప్పుడు గ్రేడ్-4 ఆస్టియో ఆర్థరైటిస్ కోసం ప్రత్యేకమైన పీఆర్‌పీ క్లినిక్‌ను ప్రారంభిస్తోందని తెలిపారు. దక్షిణ భారత దేశంలో మొత్తం ఐదు కేంద్రాలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు పేర్కొన్నారు. ఎపియోన్ సహ వ్యవస్థాపకురాలు డాక్టర్ మినల్ చంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.