calender_icon.png 29 November, 2024 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోగులపట్ల ప్రేమతో వ్యవహరించండి

25-09-2024 02:07:00 AM

  1. వైద్యులు, సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి
  2. శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్‌కేర్ వ్యవస్థ ప్రక్షాళన  
  3. టీచింగ్ హాస్పిటల్స్‌లో సెక్యూరిటీ ఔట్‌పోస్టులు ఏర్పాటు 
  4. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): అనారోగ్యంతో ఎంతో బాధలో రోగులు దవాఖానకు వస్తారని.. వారితో కటువుగా మాట్లాడి మరింత బాధ పెట్టొద్దని, మర్యాదగా, ప్రేమగా మాట్లాడాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వైద్యులు, సిబ్బందికి సూచించారు.

సెక్యూరిటీ దగ్గర్నుంచి డాక్టర్ల వరకూ పేషెంట్లతో ఓపికగా ఉండాలని, వారి అనుమా నాలు నివృత్తి చేయాలని కోరారు. ఇందుకో సం సిబ్బందికి శిక్షణ ఇప్పించాలని, అందు కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మంగళవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీసు లో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించా రు.

హాస్పిటల్ లోపల ఇన్ పేషెంట్ వార్డ్స్ లో, బయట అవుట్ పేషెంట్ ఏరియాలో పేషెంట్ లోడుకు తగ్గట్టు టాయిలెట్స్ ఉం డాలని సూచించారు. దవాఖాన్ల వారీగా పేషెంట్ లోడ్, టాయిలెట్స్ సంఖ్య వంటి వివరాలతో నివేదిక తయారు చేయాలని, అవసరమైన చోట టాయిలెట్ల సంఖ్య పెం చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

అవుట్ పేషెంట్ల వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు చర్య లు తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని సూచించారు. శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సిబ్బందికి బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేయాలని స్పష్టంచేశారు.

హాస్పిటళ్ల సూపరింటెండెంట్లతోపాటు డీఎంఈ, డీహెచ్, వీవీపీ కమిషనర్ల పరిధిలోని హాస్పిటళ్లలో పనిచేస్తున్న వారి బయోమెట్రిక్ అటెండెన్స్‌ను మానిటర్ చేయాలని కోరారు. డైట్, శానిటేషన్ సెక్యూరిటీ, పేషెంట్ కేర్ విభాగాలకు ప్రతి నెలా సకాలంలో నిధులు మంజూ రు చేయాలని, సిబ్బందికి వేతనాలు చెల్లించాలని ఆదేశించారు.

కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం సిబ్బందికి వేతనాలు చెల్లిస్తున్నా రా? లేదా? అన్నది పర్యవేక్షించాలన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సౌకర్యాలు కల్పించే లా చర్యలు తీసుకోవాలన్నారు.  

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్స్ విధానాలపై అధ్యయనం  

శానిటేషన్, సెక్యూరిటీ విషయంలో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్స్, కార్పొరేట్ హాస్పిటల్స్ అవలంబిస్తున్న విధానంపై అధ్యయ నం చేయాలని, ఇందుకోసం ఎక్స్‌పర్ట్ కమిటీని నియమించాలని హెల్త్ సెక్రటరీని మం త్రి దామోదర ఆదేశించారు. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, సెక్యూరిటీ విభాగాల పనితీరు, హెచ్‌ఆర్, జాబ్ చార్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, పది రోజుల్లో తనకు కమిటీ నివేదిక అందజేయాలని చెప్పారు.