calender_icon.png 23 April, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన ట్రెజరీ అధికారి రఘు కుమార్

12-04-2025 12:46:55 AM

జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 11(విజయ క్రాంతి): జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలోని ట్రెజరీ విభాగంలో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు చేశారు.ఈ దాడుల్లో రూ.7, 000 లంచం తీసుకుంటూ ట్రెజరీ కార్యాలయ సీనియర్ అకౌంటెంట్ అరిగే రఘు కుమార్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఓ ప్రభుత్వ ఉద్యోగి తన సిపిఎస్ ఖాతా నుండి రూ. ఒక లక్ష 7వేలు తీసుకోవాలని దరఖాస్తు చేసుకున్నాడు. దీనికిగాను  జిల్లా ఖజానా శాఖ సీనియర్ అకౌంటెంట్ రఘుకుమార్ రు.7 వేలు లంచంగా ఇవ్వాలని  డిమాండ్ చేశారని బాధితుడు ఆరోపించాడు. అయితే బాధితుని ఖాతాలో డబ్బులు పడడంతో తనకు ఇస్తానన్న ఏడు వేల రూపాయలు ఇవ్వాలంటూ అనేక సార్లు ఫోన్ చేస్తూ వేధించడంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

దీంతో ఏసీబీ అధికారుల సూచన మేరకు శుక్రవారం ఉదయం బాధితుడు రూ. 7 వేలను రఘు కుమార్ కు ఇవ్వగా అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు రఘుకుమార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ట్రెజరీ అధికారి రఘు కుమారును అరెస్టు చేసి ఏసీబీ కోర్టు ఎదుట హాజరు పరుస్తామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినట్లయితే ఏసీబీ అధికారుల టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు లేదా 9440446106 వాట్సప్ నెంబర్ కు గాని ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా కానీ ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.