26-03-2025 12:12:03 AM
రూపేశ్ కథానాయకుడిగా మా ఆయి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మి స్తున్న సినిమా ‘షష్టిపూర్తి’. రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రధారులు. ఆకాంక్ష సింగ్ కథానాయిక. పవన్‌ప్రభ దర్శకుడు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీత దర్శ కుడు. ఆయన సంగీత సారథ్యంలో తొలి సారి ఎంఎం కీరవాణి ఓ పాటను ఈ సినిమా కోసం రాశారు. ఈ గీతాన్ని సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ విడుదల చేశారు.
‘ఏదో ఏ జన్మలోదో ఈ పరిచయం.. నీదో నీవల్ల నాదో ఈ పరవశం.. రాగం నీదై పల్లవి నాదై.. చరణం చరణం కలిసిన వేళ.. పయనాలు ఏ హిమాలయాలకో..’ అంటూ హృద్యంగా సాగుతోం దీ పాట. దీన్ని అనన్య భట్ ఆలపిం చారు. ఈ చిత్రానికి డీవోపీ: రామ్; ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, స్టంట్స్: రామకిషన్.