భార్య మృతి, భర్తకు గాయాలు
చేవెళ్ల, నవంబర్ 14: ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు స్కూటీని ఢీకొట్టిన ఘటనలో భార్య మృతి చెందగా.. భర్తకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్పల్లి మండ లం కొత్తపల్లికి చెందిన మొండివాగు అశోక్(46), మంజుల(40) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కొడుకు శేఖర్‌కు ఏడాది కిందట మొయినాబాద్ మండలం నక్కలపల్లి గ్రామా నికి చెందిన ప్రవళికతో వివా హం జరిపించారు.
ఇటీవల ఓ శుభకార్యానికి కోడలి గ్రామానికి వెళ్లిన అత్తమా మలు అశోక్, మంజుల.. గురువారం పొద్దున స్కూటీపై స్వగ్రామానికి బయల్దేరారు. చేవెళ్ల టౌన్‌లోని ఫరా కాలేజీ ఎదుట యూటర్న్ తీసుకుంటుండగా చేవెళ్ల వైపు నుంచి షాబాద్ వైపు వెళ్తున్న అలీమ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు వీరి స్కూటీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మం జుల బస్సు కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. భర్త అశోక్‌కు తీవ్ర గాయాలు కావడంతో చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుత్రికి తరలించారు. ప్రవళిక ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.