ఆర్టీసీ డ్రైవర్లకు సంఘీభావం ప్రకటించిన ఎమ్మెల్యే మేఘా రెడ్డి
వనపర్తి, జనవరి 24 ( విజయక్రాంతి ) : ఆర్టీసీలో బస్సులో ప్రయాణం చేయడం అందరికీ సురక్షితమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం డ్రైవర్స్ డే సందర్బంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్లందరికీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్టీసీ సంస్థ తరఫున డిపో మేనేజర్ వేణుగోపాల్ ఇతర సిబ్బంది ఎమ్మెల్యే ను ప్రత్యేకంగా కలిశారు. డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడనని సురక్షితమైన డ్రైవింగ్ చేస్తానని, మద్యం సేవించి బస్సును నడపనని, రోడ్డు భద్రత లో తన వంతు పాత్ర పోషిస్తానని ప్రత్యేకంగా తయారు చేయించిన బ్యానర్ పై ఎమ్మెల్యే సంతకం చేసి డ్రైవర్లకు సంఘీభావం ప్రకటించారు.