calender_icon.png 16 March, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రెగ్నెన్సీలో ప్రయాణమా?

16-03-2025 12:31:56 AM

ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ప్రయాణాలు చేయాలనుకుంటున్నారా.. అయితే గర్భం ధరించిన మహిళల్లో ఒక్కొక్కరి ఆరోగ్య పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. కాబోయే అమ్మలు మాత్రం ప్రయాణాలు చేసేటప్పుడు వైద్యుల సలహాతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

* గర్భం ధరించిన మహిళల్లో వికారం, వాంతులు.. వంటి లక్షణాలు కొన్ని నెలల పాటు కొనసాగుతాయి. అందుకే ప్రయాణాల్లో ఇలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే సులభంగా జీర్ణమయ్యే పోషకాహారాన్ని తక్కువ మొత్తంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రయాణ సమయంలోనూ తేలికపాటి ఆహారమే మంచిది.

* ప్రెగ్నెన్సీ రిపోర్టులు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్, మందులు లాంటివన్నీ ఎప్పుడూ మీ వెంటే ఉంచుకోవాలి. అత్యవసర పరిస్థితి వస్తే వెంటనే అక్కడికి దగ్గర్లోని ఆస్పత్రిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవచ్చు.

* ఓ నీళ్ల బాటిల్‌ను వెంట ఉంచుకోవడమూ మరవద్దు. అలాగే మధ్యమధ్యలో వీలుంటే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో నీటి స్థాయులు పడిపోకుండా ఉంటాయి. అలాగే శరీరానికి తక్షణ శక్తి కూడా వస్తుంది. ఇక పండ్ల రసాలు తాగాలనుకున్న వారు ఇంటి నుంచే తయారుచేసి పట్టుకెళ్లడం ఉత్తమం.

* ప్రయాణాల్లో బిగుతైన దుస్తులు కాకుండా వదులుగా, సౌకర్యవంతంగా ఉండే దుస్తులు వేసుకోవడం మంచిది. తద్వారా కూర్చున్నా ఇబ్బందిగా అనిపించదు.