calender_icon.png 8 April, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంట్లోనే.. టూరేద్దాం

23-03-2025 12:00:00 AM

చాలామందికి ట్రావెలింగ్ అంటే చెప్పలేనంత ఇష్టం ఉంటుంది. కాని, సమయం దొరక్క వాయిదా వేస్తుంటారు. అయితే నచ్చిన ప్రదేశాలకు వెళ్లకపోయినా.. ఇంటి అలంకరణ వస్తువుల రూపంలో ఆ ప్రాంతాలను ఇంటికే తెచ్చుకోవచ్చు. ఎలాగో తెలుసా.. 

మీ ఇంటి ఆవరణలోనే ఓ మినీ బీచ్‌ను ఏర్పాటుచేసుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అక్కడికెళ్లి సేదదీరచ్చు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. మీ గార్డెన్, లేదంటే డాబాపై ఓ మినీ పూల్‌ను ఏర్పాటుచేసుకోండి. ఇలాంటివి ఇప్పుడు మార్కెట్లో విభిన్న ఆకృతుల్లో దొరుకుతున్నాయి. అందులో నీళ్లు నింపుకొని.. వాటి ముందే మీ ఇంట్లో ఉండే ఉడెన్ లాంజ్ కుర్చీలు వేసుకోండి.. ఆపై చుట్టుపక్కల సముద్రం, బీచ్‌తో కూడిన ఫొటోలను ఏర్పాటు చేసుకుంటే మరింత వాస్తవికత వస్తుంది.

గోడలపై ట్రావెల్ ఫొటోలు

ఇంటి అలంకరణలో గోడలది ప్రత్యేక పాత్ర. విహార యాత్రలకు సంబంధించిన వస్తువుల్ని గోడలపై అమర్చుకొని.. ట్రావెలింగ్ అనుభూతినీ పొందవచ్చు అంటున్నా రు నిపుణులు. ఈ క్రమంలో గోడంతా కవరయ్యేలా ప్రపంచ పటం వాల్‌పేపర్‌ను అతికించచ్చు. పర్యటక ప్రదేశాలకు సంబంధించిన ఫొటోలను (ఉదాహరణకు.. ఈఫిల్ టవర్, తాజ్ మహల్) తోరణంలా కట్టి గోడకు వేలా డదీయచ్చు. ఆయా ప్రదేశాలను -సముద్రంతో కూడిన అందమైన వాల్‌పేపర్స్‌ను అతికించడం, అక్కడి వింటే జ్ కార్ల నమూనాల్ని తయారుచేయించుకొని గోడలపై అలంకరించుకోవచ్చు. అభిరుచికి తగ్గట్లుగా.. ఓ మంచి డిజైనర్ సహాయంతో ఆయా ప్రదేశాలకు సంబంధించిన చిత్రాల్ని వేయించు కోవచ్చు.

ఇంట్లోనే కాటేజీ

చాలామందికి కాటేజీలో సేదతీరాలని, రాత్రిళ్లు అందు లో నిద్రపోవాలని ఉంటుంది. అలాంటి వాళ్లు ఇంట్లో ఓ కాటేజీని ఏర్పాటు చేసుకొని అద్భుతమైన ఫీలింగ్స్ సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం ఇంటి వెనుకాల ఓ ప్రాం తంలో తెల్లని దుస్తులతో కూడిన గూడారం కట్టుకొని, అందులో అందమైన బెడ్, దానికి తగ్గట్టుగా లైటింగ్, అక్కడక్కడ రకరకాల పూలతో కూడిన డిజైన్స్ ఏర్పాటుచేసుకుంటే అచ్చం కాటేజీ అనుభూతిని పొందవచ్చు.

ఆచార వ్యవహారాలకు తగినట్టుగా

మీకు నచ్చే పర్యటక ప్రదేశాల సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు తగినట్లుగా కూడా ఇంటి ఫర్నిచర్‌లో మార్పులు -చేర్పులు చేసుకోవచ్చు. రొమాంటిక్ వాతావరణాన్ని తలపించేలా ఫ్రెంచ్ స్టైల్, పర్షియ న్ స్టైల్లో కావాలనుకుంటే రాగి వస్తువుల్ని అ మర్చుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఫర్నిచర్, కర్టెన్లు, ఇతర డెకరేషన్ మార్పులు చేయడం వల్ల విభిన్న అనుభూతుల్ని సొంతం చేసుకోవచ్చు.