గుంతలమయంగా రహదారి
రోడ్డును నేషనల్ హైవేగా గుర్తించని కేంద్రం
అప్పటివరకు మరమ్మతులైనా చేపట్టని ఆర్‌అండ్‌బీశాఖ
ఈ మార్గంలో తరచూ రోడ్డు ప్రమాదాలు.. ప్రాణాలు గల్లంతు
సంగారెడ్డి, అక్టోబర్ 15 (విజయక్రాంతి): జహీరాబాద్-బీదర్ రోడ్డు గుంతలమయంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అస్తవ్యస్తంగా మారింది. దీంతో జహీరాబాద్ - బీదర్ రోడ్డుపై నారింజ ప్రాజెక్టు, మీర్జాపూర్ (బీ), గంగ్వార్ చౌరస్తా, గణేశ్ పూర్ చౌరస్తా, కొత్తూర్ (బీ) గ్రామాల వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
ఈ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించి నాలుగు లేన్లగా రోడ్డుగా విస్తరించాలని రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అప్పటివరకు ఆర్‌అండ్‌బీ శాఖ కనీసం ఉన్నరోడ్డుకు మరమ్మతులు సైతం చేపట్టడం లేదు. దీంతో ఈ రోడ్డు రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్‌గా మారింది.
ప్రమాదాలు ఇలా..
నేషనల్ హైవే అధికారులు గతంలో తాండూరు సమీపంలోని మన్నేగూడ- బీదర్ రోడ్డును జాతీ య రహదారిగా గుర్తించే అవకాశాలపై సర్వే చేపట్టారు. నివేదికను కేం ద్ర ప్రభుత్వానికి నివేదించారు. కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గత నెలలో బీదర్ రోడ్డులోని నారింజ ప్రాజెక్టు వద్ద హైదరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు- బైక్‌ను ఢీకొట్టింది.
ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడి కక్కడే మృతిచెందారు. మృతులిద్ద రూ కర్ణాటకలోని బీదర్‌వాసులు. న్యాల్‌కల్ మండలంలోని గణేష్‌పూ ర్ చౌరస్తా వద్ద కర్ణాటక నుంచి వస్తు న్న బస్సు ఓ బైక్‌ను ఢీ కొట్టింది. ఘటనలో తీవ్రగాయాల పాలై నలుగురు మృతిచెందారు. అలాగే అనేక రోడ్డు ప్రమాదాల్లో పదుల సం ఖ్యలో వాహనదారులు గాయపడ్డారు.
రోడ్డు ప్రమాదాలు సంభవిం చి ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నా, కొందరు గాయాల పాలై వైకల్యం పొందినా సర్కార్ మాత్రం స్పందించడం లేదు. ఈ రోడ్డును కేంద్రం జాతీయ రహదారిగా గుర్తించడం లేదు. నాలుగు లేన్ల రోడ్డుగా విస్తరించడం లేదు.ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం చొరవ తీసుకుని నాలుగు లేన్ల రహదారిగా విస్తరించేందుకు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.