జిల్లా ఎస్పీ డి జానకి
మహబూబ్ నగర్, జనవరి 11 (విజయ క్రాంతి) : సంక్రాంతి పండగ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు తమ ఊళ్లకు వెళ్ళే అవకాశం ఉన్నందున ప్రజలు తమ ప్రయాణాలను ప్రశాంతమైన వాతావరణంలో ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని పరుగులు తీయకూడదని జిల్లా ఎస్పీ డి జానకి అన్నారు.
శనివారం జాతీయ రహదారి-44 పై హైదరాబాద్ నుండి కర్నూలు వైపు వెళ్ళే మార్గంలో ట్రాఫిక్ సాఫీగా కొనసాగేందుకు స్వయంగా జిల్లా ఎస్పీ శ్డి. జానకి, ట్రాఫిక్ నియంత్రణను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటేశ్వర్లు, జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జున, బాలానగర్ ఎస్త్స్ర తిరుపాజీ పాల్గొన్నారు.