25-02-2025 12:57:42 AM
మోతే, ఫిబ్రవరి 24:- కొందరు ప్రైవేటు వాహనదారుల నిర్లక్ష్యం వలన నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్న అధిక సంఖ్యలో జనాన్ని వాహనాల్లో ఎక్కిస్తూ పదే పదే అదే తప్పు చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల నుంచి ఆటోలు, ట్రాన్స్పోర్ట్ రవాణా వాహనాలైన ట్రాలీ ఆటోలలో అమాయక కూలీలను ఎక్కించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు
మోతే మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల నుంచి మిరప తోటలు ఏరేందుకు పదుల సంఖ్యలో వాహనాలను పెట్టి పరిమితికి మించి జనాన్ని ఎక్కించి రవాణా చేస్తున్న స్థానిక పోలీసులు చర్యలు తీసుకోవడంలో విఫలం చెందారని విమర్శలు వినబడుతున్నాయి హుస్సేనా బాద్ వద్ద అధిక సంఖ్యలో కూలీలున్న వాహనాల ఫోటోలను విజయ క్రాంతి కెమెరా క్లిక్ మనిపించింది ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.