calender_icon.png 24 February, 2025 | 4:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు

24-02-2025 12:39:41 AM

బస్సులోని 12 మందికి గాయాలు

నల్లగొండ, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి) : వేగంగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ అదుపుతప్పి ట్రాక్టర్ను ఢీకొట్టడంతో మహిళ మృతి చెందగా.. 12 మందికి గాయాల య్యాయి.  మిర్యాలగూడ శివారులోని చింత పల్లి బైపాస్ వద్ద అద్దంకి-నార్కెట్పల్లి రహ దారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది.

ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు కు చెందిన పెండ్లి బృందం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్కు వచ్చి తిరుగు ప్రయాణమయ్యారు. మిర్యాలగూడ శివారు కు రాగానే బస్సు అదుపుతప్పి వెనుక నుంచి ట్రాక్టర్ను ఢీకొని రోడ్డు వెంట పొలంలోకి దూసుకెళ్లింది. ట్రాక్టర్ పల్టీకొట్టడంతో ట్రాలీలో కూర్చున్న నునావత్ సునీత (38) తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. 

డ్రైవర్ నునావత్ సైదాతోపాటు బస్సులోని రాజశేఖర్, నాగ చరిత, శైలజ, రాధ, అఖిల, శివరామకృష్ణ, సురేందర్రావు, బస్సు డ్రైవర్, క్లీనర్ గాయపడ్డారు. క్షతగాత్రుల్లో సైదాతోపాటు మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.

మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంక్ తండాకు చెందిన నునావత్  సైదా, సునీత దంపతులు సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం జటావత్ తండాలో బొడ్రాయి పండుగకు ట్రాక్టర్లో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ వన్టౌన్ పోలీసులు వెల్లడించారు.