హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): హైదరాబాద్ - -విజయ వాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ఆ రూట్‌లో రాకపోకలు సాగించే వారి కోసం టికెట్ ధరలో 10 శాతం రాయితీని తెలంగాణ ఆర్టీసీ కల్పిస్తోంది. రాజధాని ఏసీ, సూపర్ లగ్జరీ బస్సుల్లో ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ కోరుతోంది. ముం దస్తు రిజర్వేషన్ కోసం సంస్థ వెబ్‌సైట్ https://www.tgsrtcbus.inను సందర్శించాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. సెప్టెంబర్ 30 వరకు ఈ డిస్కౌంట్ ఆఫర్ ఉంటుందని ఆర్టీసీ వెల్లడించింది.