calender_icon.png 15 January, 2025 | 7:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పామనగుండ్లకు ట్రామాకేర్ సెంటర్

25-08-2024 02:42:03 AM

  1. కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద నిర్మాణానికి 
  2. ఎన్‌హెచ్‌ఏఐ అనుమతి నిరాకరణ
  3. గత నెల 8న శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి  
  4. పామనగుండ్లలో నిర్మాణానికి కలెక్టర్ స్థల పరిశీలన
  5. సాధ్యాసాధ్యాలపై త్వరలో స్పష్టత 

నల్లగొండ, ఆగస్టు 24 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్‌ప్లాజా వద్ద ప్రభుత్వం ప్రతిష్ఠాత్మ కంగా నిర్మించ తలపెట్టిన ట్రామాకేర్ సెంటర్ మరో ప్రాంతానికి తరలింది. కట్టంగూ రు మండలం పామనగుండ్ల శివారులో నిర్మి ంచేందుకు సర్కార్ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నది. ఇటీవల కలెక్టర్ నారాయణరెడ్డి ప్రతిపాదిత ప్రాంతాన్ని అధికారులతో కలిసి స్థలాన్ని సైతం పరిశీలించారు. విజయవా డఖూ హైదరాబాద్ జాతీయ రహదారి (65వ నంబర్)పై రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికి తక్షణం చికిత్స అందించి ప్రాణనష్టాన్ని నివారించేందుకు ఆరోగ్యశాఖ భాగ స్వామ్యంతో ఏడీపీ (ఆటోమెటిక్ డేటాబేస్ ప్రోసెస్) అనే సాఫ్ట్‌వేర్ సంస్థ రూ.5 కోట్ల వ్యయంతో 6,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెంటర్‌ను నిర్మించేందుకు ముందుకు వచ్చింది.

గత నెల 8న రోడ్డు రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఏడీపీ సం స్థ ప్రతినిధులు పనులకు శంకుస్థాపన చే శా రు. మూడు నెలల్లోనే పనులు పూర్తి చే యాలని మంత్రి నిర్మాణ సంస్థను ఆదేశించారు. ఆ మరుసటి రోజే పనులను ప్రారంభమయ్యాయి. కానీ నెలరోజుల తరువాత నేషన ల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్మాణానికి అనుమతి నిరాకరించి ంది. 2010 లోనే హైవే నాలుగు లేన్ల విస్తరణ సమయంలో రైతుల నుంచి ప్రభుత్వ ం భూమిని సేకరించి ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగి ంచింది.

సదరు భూమిని ఇతర సంస్థల కార్యకలాపాలకు బదలాయించేది లేదని, తక్షణం పనులు నిలిపివేయాలని ఎన్‌హెచ్‌ఏఐ నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసిన ట్లు సమాచారం. దీంతో  కొర్లపహాడ్ టోల్‌ప్లాజా సమీపంలో ఇప్పటివరకు జరిగిన నిర్మాణాలను ఏడీపీ సంస్థ కూల్చివేసింది. ఇ ప్పటికే యంత్రాలను, ఇతర సామగ్రిని అక్క డి నుంచి తరలించారు. కట్టంగూరు మండ లం పామనగుండ్ల వద్ద హైవే పక్కనే ఉన్న మూడెకరాల ప్రభుత్వ భూమిని ఇటీవల అ ధికారులు గుర్తించి ఇక్కడ ట్రామాకేర్ నిర్మాణానికి  సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. 

ఎన్‌హెచ్ 17 బ్లాక్ స్పాట్లు..

హైదరాబాద్65విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 65)పై 17 బ్లాక్ స్పాట్లు ఉన్నాయి. ఏడాదికి సుమారు 500 వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి. గతేడాది జరిగిన ప్రమాదాల్లో 120 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ రహదారిపై కేతేపల్లి టోల్‌ప్లాజా కీలక జంక్షన్‌గా గుర్తించి ఇక్కడ ట్రామాకేర్ నిర్మిస్తే రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడొచ్చని ప్రభుత్వం భావించింది.

కానీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా తన పరిధిలోని స్థలాన్ని కేటాయించేందుకు నిరాకరించడంతో కట్టంగూరు మండలం పామనగుండ్ల శివారులో నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ నెల 21న కలెక్టర్ ఇక్కడ స్థలాన్ని సైతం పరిశీలించారు. మూడు రోజుల్లోగా ప్రభుత్వ స్థలానికి స్పష్టంగా హద్దులు గుర్తించాలని ఆదేశించారు. స్థలంలో చెత్తాచెదారం, చెట్లను తొలగించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు.