calender_icon.png 28 April, 2025 | 9:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రస్మా రంగారెడ్డి జిల్లా స్థాయి ఎన్నికలు

28-04-2025 01:31:22 AM

-అధ్యక్ష,ప్రధాన కార్యదర్శిగా భీష్మారెడ్డి, పి.వెంకటరమణ

ముషీరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి) : తెలంగాణ రికగ్నుజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్(ట్రస్మా) ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఓ హోటల్ లో రంగారెడ్డి జిల్లా స్థాయి ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడిగా గాయం భీష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పి.వెంకటరమణ, కోశాధికారిగా ఎండి.రఫీ ఏకిగ్రవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు ప్రైవేట్ స్కూల్స్ ఎదుగుదలకు కృషి చేస్తానని ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ ఎన్నికలకు ట్రస్మా రాష్ర్ట అధ్యక్షుడు ఎస్.ఎన్.రెడ్డి,  ప్రధాన కార్యదర్శి కే.అనిల్ కుమార్, కోశాధికారి కె.శ్రీకాంత్ రెడ్డి అసోసియేట్ ప్రెసిడెంట్ కె.రామేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి డిస్టిక్ అసోసియేట్ ప్రెసిడెంట్ ఎ.యాదగిరి శేరిలింగంపల్లి మండల్ అధ్యక్షుడు మారోజి ఆచార్య, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ శంకర్, కోశాధికారి రెహమాన్ ఇతర మండల, డిస్టిక్, కౌన్సిల్ సభ్యులు శేర్లింగంపల్లి స్కూల్స్ కరస్పాండెంట్స్ హాజరయ్యారు.