calender_icon.png 23 December, 2024 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబులెన్స్‌లో గంజాయి రవాణా

16-09-2024 01:22:15 AM

  1. రూ.2 కోట్ల విలువైన సరుకు పట్టివేత 
  2. వివరాలను గోప్యంగా ఉంచుతున్న పోలీసులు

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): గుర్తుతెలియని ప్రాంతం నుంచి కొత్తగూడెం జిల్లాకేంద్రం గుండా అంబులెన్స్‌లో గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కానీ పోలీసులు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ అంబులెన్సులో దుండగులు గంజాయి తరలిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి పోలీసులు రామవరం వద్ద అంబులెన్స్ పంక్చర్ అయి నిలిచింది.

ముగ్గురు స్థానికులు విషయం తెలియకుండానే దుండగులకు సహకరించారు. ఈ క్రమంలో స్థానికులకు అంబులెన్స్‌లో గంజాయి తరలిస్తున్నట్లు పసిగట్టి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వచ్చి అంబులెన్స్‌ను సోదా చేశారు. బండిలో సుమారు 2.50 నుంచి 3 క్వింటాళ్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉన్నది.