calender_icon.png 5 December, 2024 | 7:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు ‘రవాణా’ విజయోత్సవాలు

05-12-2024 12:55:24 AM

  1. 54 మందికి ‘కారుణ్య’ నియామకపత్రాలు
  2. లోగోను ఆవిష్కరించనున్న సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, డిసెంబర్ ౪ (విజయక్రాంతి): ప్రజాపాలన విజయోత్స వాల్లో భాగంగా గురువారం మధ్యాహ్నం 2 గంటలకు హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ (ఐమ్యాక్స్ థియేటర్ పక్కన)లో ఏర్పాటు చేసిన సభకు సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అథితిగా హాజరుకానున్నారు. రవాణా శాఖ లోగోను ఆవిష్కరించటంతోపాటు స్క్రాపింగ్ పాలసీ ఆర్డర్‌ను సీఎం అందించనున్నారు.

అదేవిధంగా కారుణ్య నియామకాలకు సంబంధించి 54 మందికి ఆర్డర్ కాపీలను అందిస్తారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. అంతకుముందు ఏడాది పాలనలో రవాణా శాఖ విజయాలపై మంత్రులు పొన్నం, సీతక్క సెక్రటేరియేట్‌లో మీడియాతో మాట్లాడనున్నారు.