calender_icon.png 11 January, 2025 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరిహద్దులో ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేసిన రవాణా శాఖ అధికారులు

11-01-2025 01:35:15 PM

సరైన పత్రాలు లేని మూడు ట్రావెల్ బస్సులపై కేసు నమోదు 

జహీరాబాద్ రవాణా శాఖ చెక్ పోస్ట్ వద్ద ట్రావెల్ బస్సులో తనిఖీలు 

సంగారెడ్డి, (విజయక్రాంతి),జహీరాబాద్: 65వ జాతీయ రహదారిపై ఉన్న ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద రవాణా శాఖ అధికారులు ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేశారు. శనివారం ఉదయం నుంచి 65వ జాతీయ రహదారిపై రాష్ట్ర సరిహద్దులు మాడిగి శివారులో ఉన్న రవాణా శాఖ చెక్పోస్ట్ వద్ద అధికారులు తనిఖీలు నిర్వహించారు. కర్ణాటక, మహారాష్ట్ర వైపు నుంచి వస్తున్న ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేయగా మూడు ట్రావెల్ బస్సులకు సరైన పత్రాలు లేకపోవడంతో కేసులో నమోదు చేశారు. ట్రావెల్స్ యజమానులు ఫైన్ చెల్లించి బస్సులు తీసుకోవడం జరిగిందని అధికారులు తెలిపారు.

మరో 10 ట్రావెల్ బస్సులను తనిఖీ చేయగా సరైన పత్రాలు ఉండడంతో వదిలేశారు. తెలంగాణ వైపు నుంచి కర్ణాటక మహారాష్ట్ర వైపు వెళుతున్న బస్సులను సైతం తనిఖీలు నిర్వహించారు. పత్రాలను పరిశీలించడంతోపాటు కెపాసిటీకి మించి ప్రయాణికులను తరలించే వారిపై సైతం చర్యలు తీసుకున్నారు. బస్సుల్లో అనుమతులు లేకుండా వస్తువులు తరలించిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రావెల్స్ బస్సులపై తనిఖీలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా తనిఖీలు చేస్తున్నట్టు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో నివారించడంతోపాటు సరైన పత్రాలు లేకుండా నడిపిస్తున్న ట్రావెల్స్ బస్సులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ఏఎంవీఐ కిరణ్, సిబ్బంది చంద్రయ్య , బాల్ రాజ్ తదితరులు ఉన్నారు.