రైల్ నిలయం ప్రాంగణంలో ఉన్న రావి చెట్టు
- కొత్త కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణం కోసం మరో చోటుకు తరలింపు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (విజయక్రాంతి): రైల్ నిలయం ప్రాంగణంలోని 60 ఏళ్లకు పైబడిన రావి చెట్టును ఇంజినీరింగ్ అధికారులు మరోచోటుకు తరలించి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. కొత్త కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణం దృష్ట్యా ఈ చెట్టు వేర్లు దెబ్బతినకుండా పక్కా ప్రణాళికతో రైల్ నిలయం ఆవరణలోనే మరో చోటుకు తరలించినట్టు అధికారులు తెలిపారు.
సుమారు 40 అడుగుల ఎత్తు, 3 మీటర్ల విస్తీరణంతో ఉన్న ఈ చెట్టును కర్నూల్‌కు చెందిన ప్రము ఖ ప్రకృతి ప్రేమికుడు చంద్రమౌళి పర్యవేక్షణలో ట్రాన్‌ప్లాంటేషన్ చేపట్టారు. స్థల మార్పిడిలో భాగంగా కొమ్మలను నరకడానికి ముందు, తరువాత నూనెతో కూడిన 50 కిలోల వేపపిండి కేక్‌ను ఉపయోగించారు. 200 లీటర్ల నీటిలో కరిగించిన 2 లీటర్ల హ్యూమిక్ యాసిడ్‌ను చల్లడంతో పాటు 180 కిలోల సహజ ఎరువును చెట్ట ను తిరిగి నాటిన స్థలంలో ఉపయోగించారు.
ఈ చెట్టు కొమ్మలు 3 నుంచి 6 నెలల్లో పెరుగుతాయని నిపుణుల పేర్కొన్నారు. ఈ సందర్భంగా చెట్టును ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన చంద్రమౌళిని రైల్ నిలయం జీఎం అరుణ్‌కుమార్ జైన్ అభినందించారు.