calender_icon.png 1 April, 2025 | 8:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారదర్శకంగా సహాయ ప్రొఫెసర్ల ఎంపిక

29-03-2025 10:20:21 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు బోధన అందించేందుకు ఇంటర్వ్యూ ద్వారా సహాయ ప్రొఫెసర్లను పారదర్శకంగా ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రం సమీపంలోని అంకుశాపూర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సహాయ ప్రొఫెసర్ల ఎంపిక కొరకు నిర్వహించిన ఇంటర్వ్యూ కు జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి లతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వ వైద్య కళాశాలలోని వైద్య విద్యార్థిని, విద్యార్థులకు విద్యా బోధన అందించేందుకు సహాయ ప్రొఫెసర్లను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం వైద్య కళాశాలల ద్వారా ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది సంఖ్యను పెంపొందించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కళాశాలలోని వివిధ బ్లాక్ లను పరిశీలించి, పనులను త్వరగా పూర్తిచేసి వైద్య విద్యార్థులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పర్యవేక్షకులు, జన్మదిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.