calender_icon.png 20 March, 2025 | 1:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారదర్శకంగా క్వార్టర్ల కౌన్సిలింగ్

19-03-2025 08:48:10 PM

మందమర్రి (విజయక్రాంతి): ఏరియాలో విధులు నిర్వహిస్తున్న సింగరేణి ఉద్యోగులకు సింగరేణి క్వార్టర్లను కేటాయించేందుకు నిర్వహించిన కౌన్సిలింగ్ పారదర్శకంగా జరిగింది. సింగరేణి క్వార్టర్లు కేటాయింపుకు గాను పట్టణంలోని సీఈఆర్ క్లబ్ లో బుదవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాం సుందర్ మాట్లాడారు. కౌన్సిలింగ్ కు మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియలకు 93 క్వాటర్స్ ప్రకటించగా, 54 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని, సీనియార్టీ ప్రకారం 21 మంది ఎన్సిడబ్ల్యూఎ ఉద్యోగులకు సీనియారిటీ ప్రాతిపాదికన క్వార్టర్లు కేటాయించామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం విజయ్ ప్రసాద్, డీజీఎం ఐఈడి రాజన్న, డివైపిఎం మైత్రేయ బంధు, రాజలింగు (ఒఎస్) పాల్గొన్నారు.