calender_icon.png 30 October, 2024 | 11:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్లకు పారదర్శకంగా ఎంపికలు

30-10-2024 01:26:17 AM

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 

ఖమ్మం, అక్టోబర్ 29 (విజయక్రాంతి): గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, పారదర్శకంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. మంగళవారం రాత్రి ఆయన ఎర్రుపాలెం మండలంలో పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు.

దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రవేశపెడుతున్నామన్నారు. తమ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్  ప్రకటించి, అందుకు అనుగుణంగా వేలాది ఉద్యోగాలు  భర్తీ చేశామన్నారు. ఎలాంటి లీక్ సమస్య లేకుండా  గ్రూప్ డీఎస్సీ వంటి పరీక్షలు నిర్వహించామన్నారు. త్వర లో మరో 6 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

రైతులకు సంబం ధించిన రూ.18వేల కోట్ల రుణాలను మాఫీ చేశామన్నారు. సంవత్సరానికి మహిళలకు రూ.20 వేల కోట్ల రుణాలు అందిస్తున్నామన్నారు. ఎర్రుపాలెం మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతానన్నారు. పర్యటనలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కల్లూరు ఆర్డీవో రాజేందర్ గౌడ్  ఉన్నారు.