calender_icon.png 19 April, 2025 | 7:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారదర్శకం ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు

17-04-2025 12:45:45 AM

వికారాబాద్, ఏప్రిల్-16: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మఇండ్ల ను  పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులకు  కే టాయిస్తామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్  తెలిపారు.బుధవారం ఆయన పరిగి  శాసన సభ్యులు రాం మోహన్ రెడ్డి  ల తో కలిసి పరిగి నియోజకవర్గం సుల్తాన్ పూర్ గ్రామం లో ఇందిరమ్మ ఇండ్ల  నిర్మాణానికి భూమి పూజ  చేశారు.

అంతేకాక పరిగి మండల  త హసీల్దారు  కార్యాలయం లో  ప్రజల నుండి పలు విజ్ఞాపనలను స్వీకరించారు. పరిగి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని సమస్యలన్నింటిని ప్రభుత్వానికి నివేదిస్తామని వారు తెలిపారు.  ముఖ్యంగా పరిగి నియోజకవర్గ సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు శాసనసభ్యులు రామ్ మోహన్ రెడ్డి  సహకారంతో చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి, మరియు  జిల్లా కలెక్టర్  ప్రతీక్ జైన్ కలి సి తహసిల్దారు కార్యాలయ ఆవరణలో ఉన్న 100 సంవత్సరాల పైబడిన పురాతన భవనాలను పరిశీలించారు. వీటి స్థానంలో నూతన భవనాల నిర్మాణానికి లేదా ప్రభు త్వ ఆస్తుల సక్రమ వినియోగానికి చర్యలు తీసుకున్నందుకు పూర్తి వివరాలతో సర్వే నంబర్ మ్యాపులతో కూడిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటామని  తెలిపారు.