calender_icon.png 12 January, 2025 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలి

12-01-2025 12:00:00 AM

అధికారులకు సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి దిశానిర్దేశం

సంగారెడ్డి , జనవరి 11 (విజయ క్రాంతి) : రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరో సా పథకాలకు సంబం ధించి ఈ నెల 21 నుండి 24 వరకు పంచాయతీల పరిధిలో గ్రామ సభలను, మున్సిపల్ పట్టణాలలో వార్డు సభలను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్   క్రాంతి అధికారులను ఆదేశించారు.

శనివారం సంగారెడ్డి కలెక్టరేట్‌లో వివిధశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం పట్టా పాస్ పుస్తకాలు కలిగిన రైతులకు ఖరీఫ్, రబీ సీజన్లను కలుపుకొని ప్రతి యేటా ఎకరానికి రూ .12వేల చొప్పున నేరుగా వారి ఖాతాలలో నగదు జమ చేయనుందని తెలిపారు.

భూభారతి పోర్టల్‌లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమి విస్తీర్ణం ఆధారంగా రైతు భరోసా పథకం కింద అరులైన వారిని గుర్తించాలని సూచించారు. క్షేత్రస్థాయి సందర్శన జరిపి భూమి వ్యవసాయానికి యోగ్యమైనదా? కాదా? అన్నది నిర్ధారించాలని అన్నారు.

మండల స్థాయిలో తహసిల్దార్, మండల వ్యవసాయ అధికారి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసుకోవాలని, అలాగే గ్రామస్థాయిలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, రెవెన్యూ అధికారులతో కమిటీలను నియమించుకుని విలేజ్ మ్యాప్, గూగుల్ మ్యాప్ ఆధారంగా వ్యవసాయ యోగ్యమైన భూములను నిర్ధారించాలని కలెక్టర్ సూచించారు.

ఈనెల 20వ తేదీ లోపు క్షేత్రస్థాయి సందర్శన ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించారు. 21 నుండి 24వ తేదీ వరకు నిర్వహించే గ్రామ సభలలో వివరాలను వెల్లడిస్తూ, గ్రామ సభ ఆమోదం పొందిన మీదట సంబంధిత పోర్టల్‌లో వివరాలు నమోదు చేయాలన్నారు.

సాగు భూమిలేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు యేటా రూ.12 వేలు అందించేందుకు ఉద్దేశించిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో అరత కలిగిన కుటుంబాలను గుర్తించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు  చంద్రశేఖర్, మాధురి, పిడి డిఆర్డిఏ జ్యోతి, జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్, జడ్పీ సీఈవో జానకి రెడ్డి, పిడి హౌసింగ్ ఆర్డీవోలు పాల్గొన్నారు.