calender_icon.png 22 January, 2025 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆంగ్లంలోనూ గ్రూప్ పాఠ్యాంశాల ప్రసారం

01-09-2024 12:40:34 AM

టీ సాట్ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 31 (విజయ క్రాంతి): తెలంగాణ ప్రభుత్వం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ పోస్టుల పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం ఆంగ్ల భాషలోనూ డిజిటల్ పాఠ్యాంశ ప్రసారాలు అందిస్తున్నట్టు టీ సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే గ్రూప్ ప్రిలిమ్స్ పరీక్ష కోసం సుమారు 1,200 గంటల తెలుగు పాఠ్యాంశ భాగాలు ప్రసారం చేసిన టీ సాట్ ఆగస్టు 1వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు మెయిన్స్ పరీక్ష పాఠ్యాంశాలు ప్రసారం చేస్తోందన్నారు.

ఆంగ్ల మాధ్యమంలో పరీక్ష రాసే అభ్యర్థుల కోసం క్రాష్ కోర్సు అరగంట నిడివిగల పాఠ్యాంశ భాగాలను ఆదివారం నుంచి అక్టోబర్ 20 వరకు ప్రసారం చేస్తున్నట్టు వివరించారు. టీ సాట్ నిపుణ ఛానల్‌లో తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల వరకు అదే రోజు సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు విద్య ఛానల్‌లో పాఠ్యాంశాలు పునఃప్రసారం అవుతాయని వెల్లడించారు. తెలంగాణ, ఏపీ నుంచి గ్రూప్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల ఆదరణను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక ప్రసారాలు చేస్తున్నామని, ఆంగ్లంలో పరీక్షలు రాసే అభ్యర్థులు టీ సాట్ పాఠ్యాంశాలను సధ్వినియోగం చేసుకోవాలని కోరారు.