calender_icon.png 5 December, 2024 | 8:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్‌జెండర్లు

05-12-2024 12:37:16 AM

హైదరాబాద్ సీపీ ఆనంద్

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 4 (విజయక్రాంతి): ట్రాఫిక్ విధుల్లోకి త్వరలోనే ట్రాన్స్‌జెండర్లు అడుగు పెట్టబోతున్నారని హైదరాబాద్ సీపీ ఆనంద్ స్పష్టం చేశారు. హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసు ఉద్యోగానికి అప్లు చేసుకున్న 58 మంది ట్రాన్స్‌జెండర్లకు గోషామహల్ స్టేడియంలో పోలీస్‌శాఖ ఈవెంట్స్ నిర్వహించింది. ఈవెంట్స్‌ను సీపీ స్వయంగా పరిశీ లించారు. 44 మంది ట్రాన్స్‌జెండర్లు ఎంపికయ్యారని సీపీ తెలిపారు. వారికి త్వరలో ట్రైనింగ్ ఇచ్చి నియామక పత్రాలు అందజేస్తామన్నారు. ఈవెంట్స్‌లో ట్రాఫిక్ సీపీ పీ విశ్వప్రసాద్ పాల్గొన్నారు.