భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం శిల్పినగర్ నందు మహాజన మహిళా సమైక్య ఎంఎంఎస్ ట్రాన్స్ జెండర్స్ సమావేశం శనివారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం ఉద్దేశించి మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత, ట్రాన్స్ జెండర్ జిల్లా నాయకులు సనామాలిక్ లు మాట్లాడుతూ.... దేశంలోనే పేదప్రజల కోసం వారి హక్కుల కోసం నిరంతరం శ్రమిస్తున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేపట్టిన ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ లక్ష్యసాధనలో భాగంగా ఫిబ్రవరి 7న హైదరాబాద్ నగరంలో జరిగే లక్ష డప్పులు, వేల గొంతుల సాంస్కృతిక మహా ప్రదర్శన కార్యక్రమానికి ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ నుండి పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు.
గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఈ తెలుగు రాష్ట్రాలల్లో ఆరోగ్యశ్రీ, వికలాంగుల పెన్షన్, వితంతు వృద్ధ పెన్షన్, బియ్యం పెంపు, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ల ఏర్పాటు, వంటి అనేక ప్రజా సంక్షేమ పథకాలను పేదలకు అందించి పెట్టినటువంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన మందకృష్ణ మాదిగ అని అన్నారు. సమాజంలో మాలాంటి ట్రాన్స్ జెండర్లకు కూడా రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని మాట్లాడే ఏకైక వ్యక్తి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న అన్నారు. జనాభా కనుగుణంగా రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులను సమానంగా పెంచాలని డిమాండ్ చేపట్టే ఫిబ్రవరి 7న సంకన డప్పులతో మహాజన మహిళా సమైక్య ఆధ్వర్యంలో మా ట్రాన్స్ జెండర్స్ హైదరాబాద్ కదులుతున్నామని, మాతో పాటు ఇతర ప్రాంతంలో ఉన్న ట్రాన్స్ జెండర్స్ కూడా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అన్న పోరాటంలో భాగమవుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ జండర్స్ బానోత్ స్వీటి, హేమ, కల్యాణి, గంగోత్రి, స్వాతి, శ్వవంతి, కోట ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.