24-02-2025 12:00:00 AM
అంతర్గాం, ఫిబ్రవరి 23: రైతుల వ్యవసాయ పంటల వద్ద సాగునీటి కోసం అమర్చిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్ వైరు దొంగిలిస్తున్న ముఠాను ఆదివారం అరెస్టు చేసినట్లు అంతర్గాం ఎస్.ఐ వెంకటస్వామి తెలిపారు. మండలంలోని ఎల్లంపల్లి గ్రామ శివారులో గలట్రాన్స్ఫార్మర్ల ను గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టి అందులో నుంచి రాగి తీగ దొంగిలించారని ట్రాన్స్ కో ఏఈ ఆసా శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారని,
దీంతో ఎస్.ఐ నిందితుల కోసం ప్రత్యేక బృం దాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్ మండలం దేవునిపల్లి కి చెందిన సిరిగిరి అంజన్న (19) అనే యువకుడు మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి జల్సాల కోసం కాపర్ వైరు దొంగిలించి మంచిర్యాలకు చెందిన స్క్రాప్ వ్యాపారి వారణాసి వంశీ వద్ద విక్రయించారని తెలిపారు.
ఈమేరకు వీరిని అరెస్టు చేసి 25 కిలోల కాపర్ వైరు. రెండు సెల్ ఫోన్లు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఇదివరకు ఎన్టీపీసీ, మంథని, ఐసంత్ నగర్, వెల్లటూరు, గొల్లపల్లి, ధర్మపురి పోలీస్ స్టేషన్ల పరిధిలో 14 కేసులు నమోదై ఉన్నట్లు ఎస్.ఐ తెలిపారు.