11-03-2025 10:28:54 PM
కామారెడ్డి (విజయక్రాంతి): సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో ఎస్ఎస్ నంబర్ 236 గల ట్రాన్స్ఫార్మర్‌ను 100KVA నుండి 160KVA కు పెంచారు. ఈ సందర్భంగా SE కామారెడ్డి మాట్లాడుతూ... ఈ ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యవృద్ధి వల్ల అశోక్ నగర్ కాలనీ వాసులకు మెరుగైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అదనంగా ఎలాంటి విద్యుత్ సమస్యలు ఎదురైన 1912 నంబర్‌కు కాల్ చేయాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి SE, DE, ADE టౌన్, ఆపరేషన్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.