calender_icon.png 24 October, 2024 | 2:00 AM

జిల్లాస్థాయిలోనే బదిలీలు చేపట్టాలి

09-07-2024 04:23:20 AM

నాయబ్ తహసీల్దార్ల బదిలీలపై మంత్రి పొంగులేటికి ‘ట్రెసా’ వినతి

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 8 (విజయక్రాంతి): సాధారణ బదిలీలపై ప్రభుత్వం నిషేధం ఎత్తివేయడం సంతోషకరమని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగ రవీందర్ రెడ్డి, కే గౌతమ్‌కుమార్ అన్నారు. సోమవారం జీవో నంబర్ 80 ప్రకారం బదిలీ కాబోతు న్న నాయబ్ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లకు జిల్లాస్థాయిలోనే బదిలీలు చేప ట్టాలని కోరుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మం త్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వారు వినతిపత్రం అందజేశారు. ఇతర జిల్లాల్లో బదిలీలు కోరుకుంటే ఆప్షన్ ఇచ్చి బదిలీలు చేపట్టాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు చెప్పారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి ఎవరికీ ఇబ్బందులు కలగకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారన్నారు. అనంతరం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్‌ఏ నవీన్ మిట్టల్ కలిశారు. కార్యక్రమంలో ట్రెసా ఉపాధ్యక్షుడు కే నిరంజన్‌రావు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు రమణ్ రెడ్డి పాల్గొన్నారు.