పెద్దపల్లి (విజయక్రాంతి): జిల్లాలోని పలు మండలాల తాసిల్దారులను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో పెద్దపెల్లి కలెక్టరేట్ లో సూపర్ ఇంటెండెంట్ గా ఉన్న జగదీశ్వర్ రావు ను శ్రీరాంపూర్ మండలం తాసిల్దారుగా, మరో సూపర్డెంట్ జె. సునీతను ఓదెల మండలంకు, కాల్వ శ్రీరాంపూర్ తాసిల్దార్ ఎండి వకీల్ ను ధర్మారం మండలంకు, రామగిరి తాసిల్దార్ రామచంద్ర రావును సుల్తానాబాద్ మండలంకు, సుల్తానాబాద్ మండలం తాసిల్దార్ మధుసూదన్ రెడ్డిని ముత్తారం మండలంకు, ముత్తారం మండల తాసిల్దార్ సుమన్ ను రామగిరి మండలంకు, ధర్మారం తాసిల్దార్ అరిపోద్దిన్ ను పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.