హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): పలు విభాగాల్లో భారీగా సెక్షన్ ఆఫీసర్లను ప్రభుత్వం బదిలీ చే సింది. ఈ మేరకు గురువారం ఆయా విభాగాధిపతులు ఉత్తర్వులు జారీ చేశారు. హోమ్ డిపార్ట్‌మెంట్‌లో 13 మంది, ఎంఏయూడీలో 13 మంది, హెల్త్ అండ్ మెడికల్ విభాగంలో 11 మంది, జీఏడీలో 27 మంది, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్‌మెంట్‌లో 8మందిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఇటీవలే సచివాలయంలో భారీఎత్తున సెక్షన్ ఆఫీసర్లకు స్థానచలనం కల్పించిన సర్కారు.. తాజాగా విభాగాల వారీగా బదిలీ చేపట్టింది.