calender_icon.png 28 October, 2024 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉన్నత విద్యాశాఖలో ఉద్యోగుల బదిలీలు

16-07-2024 01:05:21 AM

మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): ఉన్నత విద్యాశాఖలో బదిలీలకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కళాశాల విద్యా, సాంకేతిక విద్య, ఇంటర్ విద్యలో పనిచేసే ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలను సోమవారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 16 నుంచి 31 వ తేదీ వరకు జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగులు బదిలీ ప్రక్రియను పూర్తిచేయాలని ఆయా కమిషనర్లకు ప్రభుత్వం ఆదే శాలు జారీచేసింది. 2024 జూన్ 30వ తేదీ వరకు ఐదేళ్లు గరిష్ఠంగా, రెండేళ్లు కనిష్ఠంగా (రిక్వెస్ట్) ఉన్న వారికి బదిలీలు చేయనున్నారు. 317 జీవో బాధితులకు పాత స్టేషన్ సీనియారిటీ పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. 30 జూన్ 2026లోపు పదవీ విరమణ పొందే ఉద్యోగులకు బదిలీల్లో మినహాయింపు ఇవ్వనున్నారు. బదిలీ అయి న ఉద్యోగులకు నూతన స్టేషన్‌లో చేరేందుకు మూడు రోజులు సమయం ఇచ్చింది. ఆ తర్వాత సీసీఏ నిబంధనల ప్రకారం చర్యలకు అవకాశం ఉంటుంది.

టిగ్లా, టిప్స్ సంఘాల హర్షం

జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గ దర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడంపై తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రభుత్వ లెక్చరర్స్ అసోసియేషన్ (టిగ్లా), తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అసోసియేషన్ నాయకులు మాచర్ల రామ కృష్ణగౌడ్, డాక్టర్ కొప్పిశెట్టి సురేశ్ తదితరు లు కృతజ్ఞతలు తెలిపారు. గత ఏడాది మేలో రెగ్యులర్ అయిన అధ్యాపకులు, ఉద్యోగు లకు కూడా ఈ బదిలీల్లో అవకాశం కల్పిం చాలని వారు కోరారు.