calender_icon.png 20 April, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెహ్రూ జూపార్కుకు తరలింపు

18-04-2025 12:00:00 AM

సంగారెడ్డి, ఏప్రిల్ 17: సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం వద్ద ఉన్న అంతర్జాతీయ పంటల పరిశోధ నా కేంద్రం ఇక్రిశాట్ పరిసరాల్లో చిరుత పులి సంచారం కలకలం రేపిం ది. చిరుతను చూశామని ఇక్రిశాట్ అధికారులు, స్థానికులు తెలుపడంతో అటవీశాఖ తక్షణమే స్పందించింది. అక్కడ బోన్లు ఏర్పా టు చేసి నిఘా పెట్టారు.

అత్యాధునిక టాప్ కెమెరాల ద్వారా చిరుత కదలికలను గుర్తించిన అధికారులు, గురువారం తెల్లవారుజామున బోనులో చిరుతను బంధించారు. అనంతరం అటవీశాఖ అధికారులు ఆ చిరుతను హైదరాబాదులోని నెహ్రూ జూపార్కు కు తరలించారు. జిల్లా అటవీ అధికారి శ్రీధర్‌రావు మాట్లాడుతూ.. చిరుత ఆరోగ్యంగా ఉన్నదని, జూపార్కులో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.