వరంగల్ జిల్లాకు బదిలీచేస్తూ ఉత్తర్వులు
కామారెడ్డి, అక్టోబర్ 27(విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ సుజాత బదిలీ అయ్యారు. వరంగల్‌కు బదిలీ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె బాధ్యతలు చేపట్టిన 9 నెలల లోపే బదిలీ కావడం గమనార్హం. ఆమె స్థానంలో ఇంకా ఎవరిని ప్రభుత్వం నియమించలేదు.
ఇందిరమ్మ కమిటీలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ఇచ్చిన పేర్లు కాకుండా కాంగ్రెస్ నాయకుల పేర్లు రావడంపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విధితమే. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఇచ్చిన పేర్లను ఫైనల్ చేశామని కమిషనర్ చెప్పడం బదిలీకి కారణమని చర్చ జరుగుతుంది.