వరంగల్ జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు
బాధ్యతలు చేపట్టిన 9 నెలల లోనే బదిలీ
ఇందిరమ్మ కమిటీలో పేర్ల లొల్లి తోనే బదిలీ వేటు
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ సుజాతను అధికారులు బదిలీ చేశారు. ఆమె బాధ్యతలు చేపట్టిన 9 నెలల లోపే బదిలీ కావడం వెనుక ఇటీవల నియమించిన ఇందిరమ్మ కమిటీల వాల్లె కారణమని భావిస్తున్నారు. కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ సుజాతను వరంగల్ జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ఆమె స్థానంలో ఇంకా ఎవరిని ప్రభుత్వం నియమించలేదు. ఫిబ్రవరి 15న కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టింది, విధి నిర్వహణలో కమిషనర్ కొంతమంది ప్రజా ప్రతినిధుల ఒత్తిడీలకు తలవగక పోవడమే బదిలీకి కారణం అని తెలుస్తుంది.
ఇందిరమ్మ కమిటీలో టిఆర్ఎస్ కౌన్సిలర్ ఇచ్చిన పేర్లు కాకుండా కాంగ్రెస్ నాయకుల పేర్లు రావడంపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విధితమే. జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇచ్చిన పేర్లను ఫైనల్ చేశామని కమిషనర్ చెప్పడం బదిలీకి కారణమని చర్చ జరుగుతుంది. మరోవైపు కొత్తగా కామారెడ్డి కమిషనర్ గా ఎవరు వస్తారు అనే చర్చ జరుగుతుంది. కామారెడ్డిలో కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్ లు ఉండడంతో పాటు స్థానికంగా బిజెపి ఎమ్మెల్యే ఉండగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో పాటు బీఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్ లు ఉండడం వల్ల కమిషనర్ గా వచ్చే వారికి మూడు పార్టీల వారి నుంచి ఒత్తిడీలు ఉంటాయని భావిస్తున్నారు.