calender_icon.png 23 December, 2024 | 7:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రేటర్‌లో 40 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ

04-07-2024 01:54:54 AM

ఉత్తర్వులు జారీ చేసిన హైదరాబాద్ సీపీ

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 3 (విజయక్రాంతి) : హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో బుధవారం భారీగా ఇన్‌స్పెక్టర్ల బదిలీలు జరిగా యి. ఇప్పటికే రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఎస్సైలు, సీఐలను ప్రభు త్వం బదిలీ చేసిన ప్రభుత్వం.. ఇప్పు డు దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తు న్న ఇన్‌స్పెక్టర్లు మొదలుకుని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల వరకు స్థాన చలనం కలిగిం చింది. గత కొద్దికాలంగా నగరంలో చోటు చేసుకుంటున్న నేరాలను అదుపు చేయడమే లక్ష్యంగా పక్కా వ్యూహంతో ఈ బదిలీలు చేపట్టినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు అనుగుణంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 40 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ జరిగింది. వీరిని బదిలీ చేస్తూ హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే బదిలీ అయిన స్థానాల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.