- ఎనిమిది మంది ఐఎఫ్‌ఎస్‌లకూ స్థానచలనం
- ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
- పర్యాటక శాఖ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ స్మితాసబర్వాల్
హైదరాబాద్, నవంబర్ 11(విజయక్రాంతి): రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్ లను రాష్ట్రప్రభుత్వం బదిలీ చేసింది. అలా గే ఎనిమిది మంది ఐఎఫ్‌ఎస్‌లకు స్థానచలనం కల్పించింది. మొన్నటివరకు రాష్ట్రం లో పనిచేసిన ఏపీ క్యాడర్ అధికారులు సొంత రాష్ట్రానికి వెళ్లిన నేపథ్యంలోనే బదిలీలు జరిగాయి.
ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు. సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్‌ను పర్యాటకం, సాంస్కృతిక, యువజన సర్వీసుల కార్యదర్శిగా నియమితులయ్యారు. ఏపీ నుంచి తెలంగాణ క్యాడర్‌కు వచ్చిన సృజన పంచా యతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించనున్నారు.
ఐఎఫ్‌ఎస్‌ల బదిలీలు ఇలా..
హైదరాబాద్ ప్రిన్సిపల్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీస్ చార్మినార్ సర్కిల్ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్‌గా, హైదరాబాద్ సీటీసీ సర్కిల్ డిప్యూటీ కన్జర్వేటర్ శివల రాంబాబును జోగుళాంబ సర్కిల్ జిల్లా ఫారెస్ట్ అధికారిగా బదిలీ అయ్యారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ డైరెక్టర్‌గా రాంబాబుకు అదనపు బాధ్యతలు అప్పగించారు.
నెహ్రూ జూవాలజికల్ పార్క్ క్యూరేటర్ సునీల్ హిరేమత్ జూ పార్కు డైరెక్టర్ బాధ్యతలు తీసుకుంటారు. ములుగు ఫారెస్ట్ జాయింట్ డైరెక్టర్ పి.శ్రీనివాసరావు సిద్దిపేట జిల్లా అటవీశాఖ అధికారిగా బదిలీ అయ్యారు. హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ ఎస్వో ప్రదీప్‌కుమార్ శెట్టి హైదరాబాద్ సీటీసీ సర్కిల్ డిప్యూటీ కన్జర్వేటర్‌గా బదిలీ అయ్యారు.
సిద్దిపేట డీఎఫ్‌వో కె.శ్రీనివాస్ హెచ్‌ఎండీఏ అర్బన్ ఫారెస్టు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. జయశంకర్ భూపాలపల్లి డీఎఫ్‌వో జె.వసంతకు నెహ్రూ జూవాలజికల్ పార్క్ క్యూరేటర్ బాధ్యతలు అప్పగించారు. జోగుళాంబ గద్వాల జిల్లా అటవీశాఖ అధికారి మందాడి నవీన్‌రెడ్డి భూపాలపల్లి డీఎఫ్‌వోగా బదిలీ అయ్యారు.