calender_icon.png 31 October, 2024 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

8 మంది జిల్లా రిజిస్ట్రార్ల బదిలీ

01-08-2024 08:30:00 AM

  1. జోన్ల వారీగా సబ్ రిజిస్ట్రార్లు కూడా.. 
  2. ఉత్తర్వులు జారీ చేసిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ

హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 31 (విజయక్రాంతి): రిజిస్ట్రేషన్ శాఖలో జిల్లా రిజిస్ట్రార్లను, సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, ఇన్‌స్పెక్టర్ జనరల్ జ్యోతి బుద్ద ప్రకాష్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఎనిమిది మంది జిల్లా రిజిస్ట్రార్లతో పాటు 136 మంది సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు. మల్టీజోన్ 56 మంది సబ్ రిజిస్ట్రార్లు(గ్రేడ్ గ్రేడ్ మల్టీజోన్),2లో 80 మంది సబ్ రిజిస్ట్రార్ల(గ్రేడ్ గ్రేడ్ అయిన వారిలో ఉన్నారు.

సాధారణ బదిలీల్లో భాగంగానే ఈ బదిలీలు జరిగినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్, ఇన్‌స్పెక్టర్ జనరల్ జ్యోతి బుద్ద ప్రకాష్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ లో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా ఉన్న ఎం సుభాషిణిని తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు వరంగల్ జిల్లా రిజిస్ట్రార్  బాధ్యతలు అప్పగించారు. అలాగే ఖమ్మం జిల్లా రిజిస్ట్రార్‌గా బదిలీ అయిన ఎం.రవీందర్‌రావు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మేడ్చల్ మల్కా జిగిరి జిల్లా ఎంవీ అండ్ ఆడిట్ రిజిస్ట్రార్‌గా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ బదిలీ

హైదరాబాద్(విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీలోని కార్మిక శాఖ డిప్యూటీ కమి షనర్ కే విజయభాస్కర్‌రెడ్డిని బదిలీ చేస్తూ బుధవారం కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే ఖమ్మం జిల్లా కార్మి క శాఖ డిప్యూటీ కమిషనర్‌గా విధుల్లో చేరాలని ఆదేశించారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా ఫ్యాక్టరీ శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఎం శ్రీనివాస్‌రెడ్డి రిటైర్ అయి న నేపథ్యంలో హైదరాబాద్‌లో డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెపెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎం మనోహర్‌రెడ్డిని మేడ్చల్ మల్కాజ్‌గిరికి బదిలీ చేశారు.