14-03-2025 12:00:00 AM
హైదరాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): ప్రపంచ బ్యాంకు ఫెలోషిప్‌కు తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్ ఎంపికయ్యారు. స్టాటిస్టిక్స్ అండ్ అనలైటిక్స్ అంశంపై గతేడాది నుంచి ప్రపంచ బ్యాంకు ఫెలోషిప్ కోర్సును నిర్వహిస్తోంది. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) కోర్సులో మాస్టర్ ఆఫ్ అప్లుడ్ సైన్స్‌లో చదువుకుని అందులో చేసిన ప్రాజెక్టు వర్క్ ఆధారంగా ఫెలోషిప్‌కు ఎంపిక చేశారు.
ఈ ఏడాది ఫెలోషిప్ కోసం 2600కు పైగా దరఖాస్తులు రాగా.. ప్రపంచవ్యాప్తంగా ఎంపికైన 33 మందిలో భారత్ నుంచి కృష్ణభాస్కర్ మాత్రమే చోటు దక్కించుకున్నారు. ఈ నెల 18 నుంచి 27 వరకు అమెరికాలో ఎంపికైన వారికి శిక్షణ ఇవ్వనున్నారు. ఆరు నెలల వ్యవధి ఉన్న కోర్సులో తదుపరి శిక్షణలో భాగంగా డిజిటల్ అనుబంధంగా దీనిని పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో కృష్ణభాస్కర్ అమెరికా వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్టాటిస్టిక్స్ అండ్ అనాలటిక్స్‌కు సంబంధించి అనుబంధాన్ని గుర్తించి ప్రపంచ వ్యాప్తంగా ఈ రంగంలో ప్రభుత్వ అధికారులను ప్రోత్సహించాలనేది ప్రపంచ బ్యాంక్ ఆలోచన. ప్రపంచ బ్యాంకు ఫెలోషిప్‌కు ఎంపికైన కృష్ణభాస్కర్‌ను గురువారం అసెంబ్లీ ఆవరణలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందించారు. భారత్ నుంచి కృష్ణ భాస్కర్ ఎంపిక కావడంపై భట్టి హర్షం వ్యక్తం చేశారు.