calender_icon.png 7 February, 2025 | 8:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మికతతో ప్రశాంత వాతావరణం..

07-02-2025 05:00:04 PM

ఎమ్మెల్యే పాయల్ శంకర్..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): భక్తి భావన, ఆధ్యాత్మిక వాతావరణంతో మంచి జీవితంలో ప్రశాంతత నెలకొంటుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. జైనథ్ మండలం కూర గ్రామంలో చేపట్టిన శ్రీ వెంకటేశ్వర స్వామీ ఆలయ బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ఆలయాన్ని సందర్శించుకుని, స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితుల తీర్థ ప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనాలు అందించారు. గ్రామస్తులంతా ఐక్యంగా ఉంటూ ఆధ్యాత్మిక వేడుకలను ఘనంగా జరపడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జైనథ్ మండల అధ్యక్షులు కరుణాకర్, నాయకులు రాందాస్, విజయ్, అశోక్ రెడ్డి, రాకేష్, విశాల్ తదితరులున్నారు.