calender_icon.png 24 December, 2024 | 1:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆవులతో తొక్కించుకుని

03-11-2024 01:14:16 AM

మధ్యప్రదేశ్‌లో దైవానుగ్రహం కోసం వింత ఆచారం

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లా భిద్వాద్ గ్రామంలో ఏళ్లుగా ఓ వింత ఆచారం కొనసాగుతోంది. ఇక్కడ దీపావళి మరుసటి రోజున భక్తులు.. ఆవులతో తొక్కించుకుంటారు. ఈ ఆచారం పాటించడం వలన తమ కోరికలు నెరవేరుతాయని వారు విశ్వసిస్తారు. ఇందులో భాగంగా ముందుగా గ్రామస్తులు ఓ ప్రాంతంలో నేలపై బోర్లా పడుకుంటారు. ఇలా పడుకున్న భక్తులపైకి కొందరు ఆవులను వదులుతారు. గోవులలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారని ప్రజల నమ్మకం. ఇలా తమపై ఆవులు నడిస్తే భగవంతుని అనుగ్రహం లభిస్తుందని వారి నమ్మకం.