calender_icon.png 25 October, 2024 | 9:04 AM

ఫిలిప్పీన్స్‌లో ట్రామీ బీభత్సం

25-10-2024 02:25:33 AM

మనీలా, అక్టోబర్ 24: ఆగ్నేయాసియా దేశమైన ఫిలిప్పీన్స్‌లో ట్రామీ తుఫాన్ బీభత్సం సృష్టించింది. తుఫా న్ కారణంగా దేశ ఉత్తర ప్రాంతంలో భారీ వరదలు రావడంతో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో దాదాపు 23 మంది చనిపోయారు. వందల కార్లు వరదలో కొట్టుకునిపోయి బురదలో కూరుకుపోయాయి. చాలా చోట్ల చెట్లు నేల కూలడంతో రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఉత్తర ప్రావిన్స్‌లోకి తుఫాన్ ప్రవేశించడంతో అత్యవసర సేవలు మినహా స్కూళ్లు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. రాజధాని మనీలాకు ఆగ్నేయంగా ఉన్న  బికోల్ ప్రాంతంలో ఎక్కువ మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్ర భావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. క్యూజో న్ ప్రావిన్స్ వరదనీటిలో మునిగిపోయింది. రానున్న 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.